- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
55 సెకన్లలో 15 స్తోత్రాల పారాయణం.. తొమ్మిదేళ్ల బాలుడి రికార్డు
దిశ, ఫీచర్స్ : ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా ఏదో కళ దాగుండే ఉంటుంది. కానీ దానిని గుర్తించి మరింత పదును పెట్టడం, సరైన శిక్షణ తీసుకుని ముందుకు సాగడమే ముఖ్యం. ఈ ప్రయాణంలో తల్లి దండ్రులు, కుటుంబసభ్యులదే ప్రధాన బాధ్యత. ఈ క్రమంలో పిల్లలు ఎందులో అభిరుచి కలిగి ఉన్నారు? వారి ఇష్టాలు ఏంటి? ఏ విషయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు? అనేది గుర్తిస్తే వారి భవిష్యత్తుకు అవసరమైన శిక్షణ, గైడెన్స్ ఇవ్వొచ్చు. కాగా దేశ రాజధాని ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు తన కళతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు? ఎవరి సహకారంతో రికార్డు సృష్టించాడు?
పీతంపుర ఢిల్లీ భారతి పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ వివాన్‌కు తన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ప్రతీరోజు ఉదయాన్నే నానమ్మ ‘శివ తాండవ స్తోత్రాలు’ పారాయణం చేయడాన్ని గమనించి వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు. నానమ్మ స్తోత్రాలు చదవుతున్నప్పుడు వాటిని గుర్తుపెట్టుకుని తిరిగి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. క్లిష్టమైన శ్లోక స్తోత్రాలను కంఠస్థం చేయడంతో పాటు లయబద్ధంగా పాడటం తెలుసుకున్నాడు. కఠినమైన శివస్తోత్రాలు వివాన్ అవలీలగా పాడటం చూసి ఆశ్చర్యపోయిన అతడి తాతయ్య.. అప్పటి నుంచి వివాన్‌కు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ స్తోత్ర పారాయణానికి సంబంధించిన పలు విషయాలు చెప్పాడు. తాజాగా వివాన్ కఠినమైన ‘శివ తాండవ స్తోత్రాల’ను కేవలం 55 సెకన్లలో పారాయణం చేసి రికార్డు సృష్టించాడు. ఈ మేరకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ రికార్డు ప్రదానం చేయడంతో వివాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
అతి తక్కువ సమయంలో క్లిష్టమైన స్తోత్రాల పారాయణం చేయడం అరుదైన విషయమని, అది ఈశ్వరానుగ్రహమని వివాన్ తాతయ్య తెలిపాడు. వివాన్ కృషి, పట్టుదలతో ఈ ఫీట్ సాధించాడని, తనకు చాలా గర్వంగా ఉందని వివరించాడు. అయితే వివాన్ ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రపంచంలోని ఏడు ఖండాలు చుట్టివచ్చిన అతిపిన్న వయస్కుడిగా స్థానం పొందడం విశేషం.