సీక్రెట్ కోడ్స్‌.. సినిమాలను దాచేసిన నెట్‌ఫ్లిక్స్..!

by Anukaran |   ( Updated:2021-06-14 21:06:50.0  )
సీక్రెట్ కోడ్స్‌.. సినిమాలను దాచేసిన నెట్‌ఫ్లిక్స్..!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే ది బెస్ట్ ‘ఓవర్-ది-టాప్ కంటెంట్’ ప్లాట్‌ఫామ్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. 1997లో అమెరికాకు చెందిన బిజినెస్‌మెన్ రీడ్ హేస్టింగ్స్, టెక్ ఆంత్రప్రెన్యూర్ మార్క్ రాండోల్ఫ్ కలిసి వీడియో రెంటల్ సంస్థగా ప్రారంభించిన ఈ కంపెనీ, నేడు ఓటీటీ వరల్డ్‌లో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 203 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్, 190 ప్లస్ దేశాల్లో స్ట్రీమింగ్ సర్వీస్, 21భాషలకు మించిన కంటెంట్ కలిగి ఉన్న నెట్‌ఫ్లిక్స్‌లో యూజర్స్‌కు తెలియని కొన్ని హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రీ వాచింగ్ కంటెంట్, సీక్రెట్ కోడ్స్, వీపీఎన్ టు వాచ్ అదర్ కంట్రీస్ షోస్, కీబోర్డ్ షార్ట్‌కట్స్ వంటి మెగా-సీక్రెట్స్ గురించి స్పెషల్ స్టోరీ.

ఏ దేశంలో నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి మూవీస్, టీవీ షోస్‌తో పాటు అదనపు ఫీచర్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ మనకు అందిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో బోలెడు చిత్రాలు మనకు అందుబాటులో ఉంటాయి. దాంతో కొన్ని సమయాల్లో మనం ఏ చిత్రం చూడాలో తేల్చుకోలేకపోతాం. అలాంటి సందర్భంలో ఓ మంచి చిత్రాన్ని అందించడానికి నెట్‌ఫ్లిక్స్ ‘ప్లే సమ్‌‌‌థింగ్’ ఫీచర్ ఇటీవలే తీసుకొచ్చింది. దీంతో యూజర్ వ్యూయింగ్ హ్యాబిట్స్, హిస్టరీ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ అల్గారిథం.. సదరు వీక్షకుడు చూడవలసిన మూవీ/టీవీ షోను నిర్ణయిస్తుంది.

ఇదిలా ఉంటే.. యూజర్ తనకు ఇష్టమైన జోనర్(కామెడీ, థ్రిల్లర్, యాక్షన్) మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలనుకుంటే? అందులో కొన్ని చిత్రాలు దొరకవు. ఎందుకంటే.. అక్యురేట్ కేటగిరీకి చెందిన చిత్రాల డైరెక్టరీని యూజర్స్‌కు దొరకకుండా సీక్రెట్స్ కోడ్స్‌తో వాటిని దాచేసింది నెట్‌ఫ్లిక్స్. వీటిని స్పెసిఫిక్ నెంబర్ కోడ్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. అందుకే వాటిని ‘సీక్రెట్ కోడ్‌ మూవీస్’‌గా అభివర్ణిస్తారు. ఆయా కోడ్స్ ప్రకారం కామిక్ బుక్ అండ్ సూపర్ హీరో మూవీస్’ లేదా ‘పిల్లల పుస్తకాల ఆధారంగా సినిమాలు’/‘స్కాండినేవియన్ మూవీస్’ వంటి భిన్న కేటగిరీలకు చెందిన చిత్రాలన్నీ గ్రూపులుగా విభజించి అందుబాటులో ఉంచింది నెట్‌ఫ్లిక్స్.

కోడ్స్ ఫర్ షోస్/మూవీ జోనర్స్ : ఇందులోనూ మళ్లీ సిరీస్, మూవీ పేర్ల ఆధారాంగా కోడ్స్ ఉంటాయి. టీవీ కార్యక్రమాలు (83) : బ్రిటీష్ టీవీ షోస్ (52117), కల్ట్ టీవీ షోస్(74652), కిడ్స్ టీవీ (27346) వంటి టీవీ షోలతో కూడిన ఈ జాబితా చాలా పెద్దదే. ఇక సినిమా విభాగంలో.. యాక్షన్ అండ్ అడ్వెంచర్ (1365) ఓ జోనర్ కాగా, అందులోని కేటగిరీలకు మళ్లీ నెంబర్స్ ఉంటాయి. ఉదా : ఏషియన్ యాక్షన్ మూవీస్ (77232), యాక్షన్ థ్రిల్లర్స్ (43048).
డిఫరెంట్ జానర్స్ : అడ్వెంచర్స్ (7442), వెస్టర్న్స్ (7700) ఇండియన్ మూవీస్ (10463), కామిక్ అండ్ సూపర్ హీరో మూవీస్ (10118), క్రైమ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ (9584), మూవీస్ బేస్డ్ ఆన్ చిల్డ్రన్ బుక్స్ (10056), క్లాసిక్ వార్ మూవీస్(48744), లేట్ నైట్ కామెడీస్ (1402), రొమాంటిక్ కామెడీస్ (5475), హిస్టోరికల్ డాక్యుమెంటరీస్(5349), బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీస్(3652), డ్రామా బేస్డ్ ఆన్ రియల్ లైఫ్(3653), సూపర్ నేచరల్ హర్రర్ మూవీస్(42023), డిస్నీ మ్యూజికల్స్ (59433), యానిమే (7424), ఫ్యామిలీ మూవీస్ (783), కామెడీస్ (6548), గేఅండ్ లెస్బియన్ మూవీస్ (5977), హర్రర్ మూవీస్ (8711).

మరి ఈ కోడ్స్ డైరెక్ట్‌గా ఎంటర్ చేస్తే ఉపయోగముండదు దానికి కూడా ఓ ట్రిక్ ఉంది. అదేంటంటే.. మీ బ్రౌజర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లోకి లాగిన్ అయిన తర్వాత, ఏదో ఓ జానర్ ఎంచుకోవాలి. ఉదాహరణకు.. ‘యాక్షన్’ అని క్లిక్ చేసిన తర్వాత యూఆర్ఎల్‌(URL )ని కాపీ చేయండి. యూఆర్‌ఎల్ ఇలా ఉండాలి. https://www.netflix.com/browse/genre/action. ఇప్పుడు ఆ యూఆర్‌ఎల్ చివరి పదాన్ని మీరు ఉపయోగించాల్సిన నెంబర్ కోడ్‌తో ఫిల్ చేయండి. ఉదాహరణకు: మీరు మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ & రెజ్లింగ్ (6695) కింద ట్యాగ్ చేసిన సినిమాలను చూడాలనుకుంటే, యూఆర్‌ఎల్ ఇప్పుడు https://www.netflix.com/browse/genre/6695 లాగా ఉండాలన్నమాట. అలా ఏ జోన్‌ర్ అయినా ప్రయత్నించవచ్చు.

ఫ్రీ వాచింగ్ :

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయలేని వినియోగదారులు చాలా మంది ఉంటారు. సైనప్ చేయకుండానే, నెట్‌ఫ్లిక్స్ యూజర్ కాకుండానే, నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను ఉచితంగా చూసే అవకాశముంది. కానీ అది కేవలం నెట్‌ఫ్లిక్స్ పాపులర్ టీవీ షోల మొదటి ఎపిసోడ్‌కు మాత్రమే పరిమితం. మీరు చేయవలసిందల్లా నెట్‌ఫ్లిక్స్.కామ్/వాచ్-ఫ్రీ
(netflix.com/watch-free)ని సందర్శించండి. తరుచు నెట్‌ఫ్లిక్స్ ఈ నిబంధనలను మారుస్తూ ఉంటుంది. ఇది కేవలం పీసీ, ల్యాప్‌టాప్ వినియోగదారులకే వర్తిస్తుంది. ఏప్రిల్‌లో స్ట్రేంజర్ థింగ్స్, ఎలైట్, బాస్ బేబీ: బ్యాక్ ఇన్ బిజినెస్ వంటి షోల ఫస్ట్ ఎపిసోడ్లను ఉచితంగా చూసే అవకాశం అందించింది నెట్‌ఫ్లిక్స్.

వీపీఎన్ :

టెరిటోరియల్ లైసెన్సింగ్ ప్రకారం, ప్రతి దేశానికి చెందిన సినిమా, టీవీ కార్యక్రమాల నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్ భిన్నంగా ఉంటుంది. దీనివల్ల మనం కొన్ని మిస్ అయ్యే అవకాశముంది. అయితే నివసించే దేశంతో సంబంధం లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతీది చూడటానికి ఓ మార్గం ఉంది. అందుకోసం డివైజ్‌లో వీపీఎన్(VPN)ని ఇన్‌స్టాల్ చేసి, వేరే దేశపు నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే నెట్‌ఫ్లిక్స్ ఉచిత వీపీఎన్‌లను బ్లాక్ చేస్తుంది. అందువల్ల కంపెనీ నుంచి పెయిడ్ వీపీఎన్ పొందాలి.

కీబోర్డ్ షార్ట్‌కట్స్:

మూవీ లేదా టీవీ షో చూసేటప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా నావిగేట్ చేయడానికి, కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఉపయోగించవచ్చు. వాటిని ఉపయోగించడం ద్వారా స్ట్రీమింగ్ చేసేటప్పుడు త్వరగా పాజ్ చేసి, ప్లే చేయవచ్చు. రివైండ్ లేదా వాల్యూమ్ పెంచడం కూడా సులభంగానే ఉంటుంది.
స్పేస్ : ప్లే/పాజ్
ఎఫ్/ఎస్కెప్ : ఎంటర్/ఎగ్జిట్ టు ఫుల్ స్క్రీన్ మోడ్
ఎస్ : ఇంట్రో స్కిప్ చేసేయొచ్చు
లెఫ్/రైట్ ఆరో : రివైండ్/ఫాస్ ఫార్వార్డ్ టెన్ సెకండ్స్

హిస్టరీ :

1999లో నెట్‌ఫ్లిక్స్ ఇంటర్నెట్ ఆధారిత సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ అందించడం ప్రారంభించింది. ఈ సర్వీస్ ప్రకారం నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సినిమా టైటిల్స్, టెలివిజన్ షోలను కస్టమర్స్ ఎంపిక చేసుకున్న తర్వాత వాటిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి కస్టమర్‌కు పోస్ట్ చేసేవాళ్లు. సబ్‌స్క్రిప్షన్ స్లాబ్ ప్రకారం కస్టమర్లకు పరిమిత సంఖ్యలోనే డివిడీలను అందించేది. అప్పట్లోనే నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్‌లో దాదాపు పదివేల మూవీ టైటిల్స్‌ను కలిగి ఉండటం విశేషం. ఇక 2007 నుంచి నెట్‌ఫ్లిక్స్ తమ చందాదారులకు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలను ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇళ్లకు ప్రసారం చేయడం ప్రారంభించింది.

ఆ తర్వాత 2010లో నెట్‌ఫ్లిక్స్ అపరిమిత స్ట్రీమింగ్ సేవలను అందించే స్ట్రీమింగ్-ఓన్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 2010లో కెనడాలో, 2011లో లాటిన్ అమెరికా, కరేబియన్‌‌దీవులకు విస్తరించగా.. 2012లో యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, స్కాండినేవియాలో స్ట్రీమింగ్-ఓన్లీ ప్లాన్‌ను అందించడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ దాటి సేవలను కొనసాగించింది. మొత్తంగా 2016 నాటికి 190 దేశాలకు పైగా విస్తరించింది.

Advertisement

Next Story

Most Viewed