కరెంట్ షాక్‌తో 9నెలల గర్భిణి మృతి

by Anukaran |   ( Updated:2020-07-05 11:14:28.0  )
కరెంట్ షాక్‌తో 9నెలల గర్భిణి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంకోవారం రోజులు అయితే ఆ దంపతుల కడుపు పంట పండేది. కండ్ల ముందు కనపడుతున్న కనుపాపను చూసి ఉప్పొంగి పోయేది. ఇళ్లంతా సంబరపడేది. ఇరు కుటుంబాలు పసికందు పుట్టుకను ఎంతో ఆనందంగా బయట చెప్పుకునేవి. కానీ ఇంతలోనే దారుణం జరిగిపోయింది. కొత్త ఫ్యామిలీ మెంబర్‌‌తో గడిపే ఆ ఇంట విషాదం నిండుకుంది. కరెంట్ షాక్ రూపంలో 9నెలల గర్భిణి గోస తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టపడియ గ్రామానికి చెందిన దండెబోయిన గాలెమ్మ 9నెలల గర్భిణి. వారంరోజుల్లో డెలివరీ కావల్సి ఉంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో స్విచ్ఛాన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. గర్భిణి కడుపులోని శిశువు కూడా ఈ ప్రపంచాన్ని చూడకుండానే కనుమూసింది. కట్టుకున్న భార్య కళ్లముందే కరెంట్ షాక్‌తో మరణించడంతో భర్త గుండెలు బాదుకుంటున్నాడు. గర్భిణి మృతిలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story