ఛత్తీస్‌గఢ్ లో మరోసారి కాల్పుల కలకలం.. 9మంది మృతి?

by  |
ఛత్తీస్‌గఢ్ లో మరోసారి కాల్పుల కలకలం.. 9మంది మృతి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా సింగర్‌లో పోలీసుల కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, 18మందికి గాయాలయ్యాయి. సిలిగర్ వద్ద పోలీసుల క్యాంప్ ఏర్పాటుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు క్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనులు పోలీస్ క్యాంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఆ తర్వాతే తాము కాల్పులు జరపాల్సివచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో 9మంది మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Next Story