- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాప పుట్టిందన్న సంతోషం.. అంతలోనే ఆ తల్లికి కడుపుకోత..!
దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. జాండీస్ (పచ్చకామెర్లు) వచ్చాయని తల్లిదండ్రులు 8రోజుల పసికందును ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అదే వారు చేసిన తప్పు అని తర్వాత బాధపడినట్టు సమాచారం. ఎందుకంటే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆ పాప మరణించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వివరాల్లోకివెళితే.. అప్పడే పుట్టిన 8 రోజుల పసికందుకు జాండీస్ ఉన్నట్టు నర్సంపేటకు చెందిన తనూష ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. అయితే, ట్రీట్‌మెంట్‌లో భాగంగా కాలం చెల్లిన సెలైన్ బాటిల్ పెట్టినట్టు సమాచారం. అది కాస్త వికటించడంతో చిన్నారి మృతి చెందింది. విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు, బంధులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిరసన కాస్త తీవ్ర ఉద్రికత్తకు దారి తీయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధిత పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.