- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిత్రమైన కేసు: పేడ చోరీ.. రాష్ట్రమంతా గాలిస్తున్న పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా దొంగలు ఏం చోరీ చేస్తారు. నగలు, డబ్బు, విలువైన వస్తువులు లాంటివి.. ఇక గ్రామాల్లో అయితే పక్కింటివాళ్లు మా ఇంట్లో కొబ్బరికాయలు కొట్టేసారు.. కాయగూరలు, కోళ్లు మాయం చేశారు అని గగ్గోలు పెడుతుంటారు. ఇంకా కొన్ని చోట్ల విచిత్రమైన దొంగతనాల గురించి వింటూనే ఉంటాం. ఇక తాజాగా ఇక్కడ చెప్పుకొనే దొంగతనం వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్నా.. కష్టపడి చేసిన వాళ్లకి మాత్రం బాధే కదా. ఇంతకీ ఏం దొంగతనం జరిగిందంటే.. 800 కేజీల పేడ చోరీ కి గురైంది. ఏంటీ.. ఇప్పటివరకు ఇంతలా చెప్పింది.. పేడ గురించా అని షాక్ అవ్వకండి. ఎందుకంటే ఆ గ్రామంలో పేడను అమ్ముకొని బ్రతికే మనుషులు కూడా ఉన్నారు కాబట్టి.. ఇక ఈ వింత పేడ చోరీ కేసు ప్రస్తుతం ఒక రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్.. కోర్బా జిల్లాలోని.. దీప్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధురెనా గ్రామానికి చెందిన రైతులు పేడను అమ్మి జీవనం సాగిసున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గోదాన్ న్యాయ యోజన అనే పథకం ద్వారా… ప్రజల నుంచి ఆవుపేడను సేకరిస్తోంది. కేజీకి రూ.2 చొప్పున ఇస్తూ వారివద్ద పేడను తీసుకొని ఆ పేడతో వర్మీ కంపోస్ట్ తయారుచేయిస్తోంది. దీంతో ఆ గ్రామంలోని రైతులు ఎన్నో రోజులుగా పేడను పోగుచేసి ఒకేసారి ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక రైతు తన ఇంటివద్ద 800 కేజీల పేడను పోగుచేశాడు. 1000 కేజీలు అయ్యాకా అమ్మకానికి పెడదాముకున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 8 వ తేదీ అర్ధరాత్రి ఆ ఇంట్లో దొంగలు పడి 800 కేజీలపేడను ఎత్తుకెళ్లారు. దీంతో లబోదిబోమన్న రైతు పోలీసులను ఆశ్రయించాడు.
ఎంతో కష్టపడి పోగుచేసిన తన పేడ పోయిందని, దాని విలువ సుమారు రూ.1,600 ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా తన పేడను వెతికిపెట్టాలని పోలీసులను ప్రాధేయపడ్డాడు. మొదట ఈ కేసును విచిత్రంగా తీసుకున్న పోలీసులు ఆ గ్రామంలో రైతుల బాధను అర్డంచేసుకొని కేసును నమోదుచేసుకున్నారు. ఇక ఈ వార్త సోమవారం నాటికి ఊరు దాటి రాష్ట్రం అంతటా తెలిసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎక్కడవిన్నా పేడ చోరీ కేసే హల్చల్ చేస్తోంది.