ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్.. వైద్యుడు మృతి

by Sumithra |
ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్.. వైద్యుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని సరోజ్ సూపర్​స్పెషాలిటీ ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అదే ఆసుపత్రిలో కరోనా సోకి డాక్టార్ ఏకే రావత్ కన్నుమూశారు. మృతి చెందిన వైద్యుడు రెండు నెలల క్రితమే టీకా రెండో డోసు తీసుకున్నట్లు ఆసుపత్రి చీఫ్​మెడికల్​ఆఫీసర్ పీకే భరద్వాజ్ తెలిపారు. కరోనా బారినపడిన 80 మందిలో వైద్యులు, నర్సులు, వార్డ్ బాయ్స్, ఇతర సిబ్బంది ఉన్నట్లు భరద్వాజ్​ తెలిపారు. వారికి సరైన వైద్య అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story