వరల్డ్ యంగెస్ట్ గేమ్ డెవలపర్‌గా ఎనిమిదేళ్ల బాలిక

by Sujitha Rachapalli |   ( Updated:2020-06-02 04:45:25.0  )
వరల్డ్ యంగెస్ట్ గేమ్ డెవలపర్‌గా ఎనిమిదేళ్ల బాలిక
X

దిశ, వెబ్ డెస్క్ : కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ లాక్‌డౌన్ టైమ్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ వచ్చిన ఈ సదావకాశాన్ని తమలోని స్కిల్స్‌కు మెరుగులు దిద్దుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా చిన్నారులు ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నారు. అందుకోసం ఆన్‌లైన్‌లో డిఫరెంట్ కోర్సులు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎనిమిదేళ్ల ఇటాషా కుమారి గేమ్ డెవలపర్‌గా మారింది. ఏకంగా మొబైల్ గేమ్స్‌నే రూపొందించి వరల్డ్ యంగెస్ట్ గేమ్ డెవలపర్‌గా సర్టిఫికెట్ అందుకుని ఔరా అనిపించింది.

చిన్నారులంతా మొబైల్‌లో వీడియో గేమ్స్ ఆడుతూనో, టీవీలో కార్టూన్ చానల్ చూస్తూనో కాలం గడిపేస్తున్నారు. కానీ ఇటాషా మాత్రం.. ఆడుకునే వయసులో మొబైల్ గేమ్స్‌నే త‌యారుచేసి ప్రశంసలు అందుకుంటోంది. ఢిల్లీకి చెందిన ఇటాషా కుమారి మాన‌వ్‌భార‌తి ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో తన చదువు కొనసాగిస్తూనే.. ‘వైట్‌హాట్ జూనియ‌ర్’ అనే సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో కోడింగ్ నేర్చుకుంటోంది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, డిస్కవ‌రీ వంటి లీడింగ్ కంపెనీల్లో పనిచేసిన ఉద్యోగులు .. ‘వైట్ హాట్ జూనియర్’ను ప్రారంభించారు. కాగా ఆరు నుంచి పద్నాలుగా సంవత్సరాల చిన్నారులను ఈ డిజిటల్ ప్రపంచంలో మరింత ‘టెక్ సావీ’లుగా తీర్చదిద్దేందుకు వైట్ హాట్ కృషి చేస్తోంది.

కోర్సు ఎలా ఉంటుంది?

కోడింగ్‌లో భాగంగా.. లాజిక్, స్ట్రక్చర్, సీక్వెన్స్, అల్గారిథమిక్ థింకింగ్ నేర్పిస్తారు. చిన్నారుల్లో క్రియేటివ్ థింకింగ్‌ను పెంపొందించి.. యానిమేషన్, యాప్స్, గేమ్స్ తయారుచేసేలా వారిని ప్రోత్సహిస్తారు. ఏడాది పాటు ఉండే ఈ కోర్సులో 8 లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్‌లో చిన్నారులు చూపించిన ప్రతిభ ఆధారంగా వారికి సర్టిఫికెట్ అందిస్తారు. ఎనిమిది లెవెల్స్ పూర్తి చేసి, టాప్ ర్యాంక్‌లో నిలిచిన చిన్నారులను సిలికాన్ వ్యాలీ, ఇస్రోలకు తీసుకెళ్తారు. అక్కడ వారికి రియల్ ‘కోడింగ్ వరల్డ్’ ఎక్స్ పీరియన్స్‌ను చూపిస్తారు. ఇటాషా కుమారి రెండు వారాల్లోనే రెండు లెవెల్స్‌ను కంప్లీట్ చేయడంతో పాటు పలు గేమ్‌లను కూడా డెవలప్ చేసింది. రెండు లెవెల్స్‌ను అందరికంటే వేగంగా పూర్తి చేయడమే కాక చాలా తక్కువ టైమ్‌లో ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు గాను ‘వైట్ హాట్ సంస్థ’ ఈ అమ్మాయిని వ‌రల్డ్స్ యంగెస్ట్ స‌ర్టిఫైడ్ గేమ్ డెవ‌లప‌ర్‌గా గుర్తించింది.

Advertisement

Next Story

Most Viewed