8 మంది ఎంపీలు సస్పెండ్

by Shamantha N |   ( Updated:2020-09-21 00:03:43.0  )
8 మంది ఎంపీలు సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ బిల్లులు ఆమోదం తెలిపిన అనంతరం అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. పోడియం దగ్గరకు వచ్చి డిప్యూటీ చైర్మన్ ముందు ఉన్నటువంటి మైక్ లాక్కునే ప్రయత్నం చేసి, పత్రాలు చించేసిన 8 మంది ఎంపీలపై వేటు వేశారు. కాగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు. ఈ క్రమంలో సోమవారం సభ మరింత గందరగోళంగా జరుగనుంది.

Advertisement

Next Story