- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డిలో 7కొత్త పది పరీక్షా కేంద్రాలు
దిశ, నిజామాబాద్:
కరోనా నేపథ్యంలో భౌతిక దూరం తప్పనిసరి అయ్యింది.ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న పది పరీక్షల కోసం కామారెడ్డి జిల్లాలో కొత్తగా 7 కేంద్రాలను పెంచినట్టు కలెక్టర్ ఎ.శరత్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో ఈ విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొత్తగా సెంటర్ల ఏర్పాటుపై సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..కొత్త సెంటర్లలో పరీక్ష రాసే విద్యార్థులకు చరవాణి ద్వారా సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.ఈ ఏడాది 100శాతం ఫలితాలు సాధించిన పాఠశాల ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను సన్మానించనున్నట్టు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పాత హాల్ టికెట్ ఆధారంగానే విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. సమావేశంలో పరీక్షల ఇన్చార్జి నీలిలింగం, వివిధ మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.