కరోనా: 724 కేసులు.. 17 మృతులు

by Shamantha N |
కరోనా: 724 కేసులు.. 17 మృతులు
X

న్యూఢిల్లీ : భారత్ లో గురువారం అత్యధికంగా కరోనా(కోవిడ్ 19) కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే కొత్తగా 88 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో గురువారం కరోనా కేసుల సంఖ్య 694 కు చేరింది. తాజాగా శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఈ కేసుల సంఖ్య 724 పెరిగింది. ఇందులో 47 మంది విదేశీయులు. కాగా, 67 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వెల్లడించింది. శుక్రవారం ఉదయానికి కరోనా వైరస్ తో 17 మంది మృతి చెందినట్టు తెలిపింది.

దేశంలో మొదటిసారి కరోనా కేసు నమోదైన కేరళ లో కరోనా విజృంభిస్తున్నది. మొన్నటి వరకు మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలో 130 కరోనా కేసులు ఉండగా, కేరళలో అంతకంటే ఎక్కువగా 137 కేసులు నమోదయ్యాయి. కాగా, తెలంగాణలో 45 కేసులు వెలుగు చూసినట్టు కేంద్రం తెలిపింది. ఏపీలో 12 కేసులు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరి చొప్పున ఈ వైరస్ నుంచి కోలుకున్నట్టు పేర్కొంది.

Tags: Coronavirus, india, kerala, highest, cases, single day, maharashtra, fatalities

Advertisement

Next Story