- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూర్‌నగర్‌లో భూమి కోసం.. 70 ఏళ్ల వృద్ధుడి పోరాటం
దిశ, హుజూర్‌నగర్: అక్రమ పట్టాలపై న్యాయం కోసం పాదయాత్రగా బయలుదేరాడు ఓ వృద్ధుడు. అమ్ముకున్న భూమితో పాటు.. ఉన్న కొంచెం భూమిని కూడా కొందరు అక్రమంగా పట్టా చేయించుకున్నారని.. 70 ఏండ్ల వయసులో సొంత ఊరి నుంచి ఆర్డీఓ ఆఫీసుకు పాదయాత్రగా వచ్చాడు. అక్రమార్కుల నుంచి తన భూమిని తిరిగి ఇప్పించాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించాడు.
వినతి పత్రంలో వివరాలు పరిశీలిస్తే..
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సండ్రపంగు ప్రకాశం.. గతంలో తనకున్న భూమిని అమ్మాడు. కాల్వపల్లిలోని సర్వే నెంబర్ 66/266/3లలో 2,20 ఎకరాల భూమి ఉంది. అందులో ఒక ఎకరం పొలాన్ని 2016లో గోపాలదాసు శ్రీను అనే వ్యక్తికి విక్రయించాడు. అమ్మింది ఎకరం మాత్రమే అయితే, మిగిలిన మరో ఎకరంన్నర భూమిని కూడా అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా సర్వే నెంబర్ 173/9 లో తనకు ఉన్న 15 గుంటల భూమిలో 2009లో కొండమీద కోటయ్య, కొండమీద అంజయ్యలకు 10 గుంటలు అమ్మగా.. మిగిలిన 5 గుంటలను అక్రమంగా పట్టాచేయించుకున్నారని తెలిపాడు. మరోచోట గోపాలదాసు వీరయ్య, యల్లావుల లింగయ్యలు తన భూమిని ఆక్రమించారని వాపోయాడు. ప్రతి చోట అక్రమించబడిన తన భూమిని అధికారులు సర్వే చేసి అప్పగించాలని కోరాడు.