సోనూసూద్‌ను కొట్టిన హీరో.. కోపంతో రగిలిపోయిన విరాట్ ఏం చేశాడంటే..?

by Anukaran |   ( Updated:2021-07-14 03:37:31.0  )
sonusood news
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎంతుందో తెలియదు కానీ.. సినిమాల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచే తమ అభిమాన హీరోను ఎవరు ఏమన్నా వారు ఊరుకోరు. ఇక కరోనా సమయంలో నటుడు సోనూసూద్ పేదల పాలిట పెన్నిధిలా మారి ఎంతమంది అభిమానాన్ని చూరగొన్నాడు. ఆయన గురించి రాయని పేపర్ లేదు.. చెప్పని టీవీ లేదు.. అంతగా పాపులర్ అయిన సోను గురించి చిన్నపిల్లలను అడిగిన చెప్పేస్తారు. ఇక ఈ రియల్ హీరో.. రీల్స్ లో అదేనండీ.. సినిమాలలో విలన్ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఒక బుడ్డోడు తన అభిమాన నటుడి మీద చూపించిన ప్రేమ వైరల్ గా మారింది.

వివరాలలోకి వెళితే.. హుజూర్‌నగర్‌ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సీహెచ్‌ ప్రణయ్‌కుమార్‌, పుష్పలత జంటకు విరాట్‌ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. హుజూర్‌నగర్‌లోని శ్రీచైత్య స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్న విరాట్ కి సోనూసూద్ అంటే చాలా ఇష్టం. ఇక కరోనా కారణంగా స్కూల్ కి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటున్న విరాట్ రోజూ టీవీ లో సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే టీవీ లో ప్రసారం అవుతున్న ‘దూకుడు’ సినిమా చూస్తున్నాడు. ఆ సినిమాలో మహేష్, సోనూసూద్ ని కొడుతున్న సీన్ చూసిన బుడ్డోడు రెచ్చిపోయాడు.. కోపంతో రగిలి పోయాడు.. మా సోను అంకుల్ నే కొడతావా..? అంటూ బయటికి పరిగెత్తి రాయి తీసుకొచ్చి టీవీపై విసిరాడు. ఇంకేముంది.. ఆ టీవీ కాస్తా రెండు ముక్కలయింది. ఈ విషయాన్నీ గమనించిన తల్లిదండ్రులు టీవీని ఎందుకు పగుల గొట్టావురా అంటూ విరాట్‌ను నిలదీయగా.. అందరికీ సాయం చేస్తున్న సోనూసూద్‌ అంకుల్‌ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి రాయితో కొట్టాను అంటూ సమాధానం చెప్పడంతో అందరు ఖంగుతిన్నారు.

ప్రస్తుతం ఆ బుడతడు వార్త నెట్టింట్లో వైరల్ కాగా.. ఈ వార్తపై సోనూసూద్ తాజాగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందిస్తూ “అరేయ్‌.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు” అంటూ ట్వీట్‌ చేశాడు. ఏదిఏమైనా బుడ్డోడి అభిమానం మాత్రం పీక్స్ అంటూ నెటిజన్లు విరాట్ ని అభినందిస్తున్నారు.

Advertisement

Next Story