యూపీలో కల్తీ మందు తాగి ఏడుగురు మృతి

by Sumithra |
యూపీలో కల్తీ మందు తాగి ఏడుగురు మృతి
X

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఏడుగురు మరణించారు. మరో 15 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అమిలియా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దీనిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ సీరియస్ అయ్యారు. బాధ్యులను గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. స్థానికుల కథనం ప్రకారం, ప్రభుత్వ లైసెన్స్ పొందిన ఓ షాపులో దేశీయంగా తయారు చేసిన లిక్కర్‌ అమ్ముతున్నారు. గురువారం రాత్రి బాధితులంతా ఈ లిక్కర్‌ను సేవించారు. అనంతరం, అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఈ షాపు నడుపుతున్న భార్యభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ భార్యభర్తలపై అనేక కేసులున్నాయని, అయినప్పటికీ ఈ ఏరియాలో మూడు షాపులను నడుపుతున్నారని స్థానికులు వివరించారు.

Advertisement

Next Story