శంషాబాద్ ఎయిర్ పోర్టులో 6 కేజీల బంగారం పట్టివేత

by Sumithra |
శంషాబాద్ ఎయిర్ పోర్టులో 6 కేజీల బంగారం పట్టివేత
X

దిశ, రాజేంద్రనగర్ : విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. మంగళవారం దుబాయ్ నుంచి EK-524 విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు.

అతని దగ్గర ఉన్న వస్తువులను స్కానింగ్ చేయడంతో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్టు గుర్తించారు. ఎమర్జెన్సీ లైట్‌లో దాచిన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని బరువు 6 కేజీలు ఉండగా.. రూ. 2 కోట్ల 97 లక్షలు విలువ చేస్తుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారం తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story