- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో 2,500 దాటిన కరోనా కేసులు
దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,251 మందికి పరీక్షలు చేయగా 113 మందికి కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,605కి చేరింది. ఇందులో ఏపీకి చెందిన వారు 2,452 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 153 మందికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు.
ఏపీలో తొలి 500 కేసులకు 25 రోజులు పట్టగా, ప్రస్తుతం 9 రోజుల్లోనే 500 కేసుల మార్కు దాటేయడం గమనార్హం. గత మార్చి 21న రాష్ట్రంలో కేవలం 5 కేసులు మాత్రమే ఉండగా, ఏప్రిల్ 15 నాటికి ఏకంగా 525కు చేరుకున్నాయి. ఆ తర్వాతి నుంచి వేగంగా పెరుగుతూ బుధవారానికి 2,605 కేసులకు చేరుకున్నాయి. ఒకవైపు ఎక్కువ మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తూనే.. ఇంకోవైపు కట్టడి చేయలేక కరోనాతో సహజీవనం తప్పదని ప్రకటనలు చేస్తోంది. దీంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.