త్వరలో సింగరేణిలో 651 ఉద్యోగాలు: శ్రీధర్

by Shyam |
త్వరలో సింగరేణిలో 651 ఉద్యోగాలు: శ్రీధర్
X

దిశ,వెబ్‌డెస్క్: త్వరలో సింగరేణిలో 651 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. మార్చిలోపు సింగరేణిలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. 569 మంది కార్మికులు,82 మంది అధికారుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడించారు. అంతర్గత సిబ్బందితో మరో 1436 ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ లేకుండా రాత పరీక్ష, ప్రతిభ ఆధారంగా నియమకాలు చేపడుతామని తెలిపారు. తెలంగాణ ఆవిర్బావం తర్వాత 13,934 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.

Advertisement

Next Story