- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో కొత్తగా 6,224 కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 72,861మందికి పరీక్షలు నిర్వహించగా 6,224మందికి పాజిటివ్‌గా తేలిది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. 41మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 5,941గా ఉంది. ప్రస్తుతం 55,282 యాక్టివ్ కేసులు ఉండగా చికిత్స తీసుకొని 6,51,791 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60లక్షల 21వేల,395మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, విశాఖ జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో 890 పాజిటివ్ కేసులు రాగా, చిత్తూరులో 827, తూర్పుగోదావరిలో 824, ప్రకాశంలో 619 కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.