ముహూర్తం పెట్టినందుకు.. 60 బెదిరింపు కాల్స్

by Anukaran |   ( Updated:2020-08-04 12:05:11.0  )
ముహూర్తం పెట్టినందుకు.. 60 బెదిరింపు కాల్స్
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమి పూజ ముహూర్తం పెట్టిన పూజారికి బెదిరింపులు మొదలయ్యాయి. కర్ణాటకలోని బెళగావికి చెంిన విజయేంద్ర శర్మ ఈ ముహూర్తాన్ని ఖరారు చేశారు. అయితే, ఆయనకు గత నాలుగు రోజులుగా కొందరు దుండగులు ఫొన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు.

ఇప్పటివరకు 60 వార్నింగ్ కాల్స్ వచ్చాయని.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూజారి తెలిపాడు. ఈ మేరకు ఆయన ఇంటివద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, విజయేంద్ర శర్మ గత ప్రధానులు మొరార్జీ దేశాయ్, పీవీ నరసింహరావు, వాజ్ పేయ్‌కు సలహాదారుడిగా పనిచేసిన అనుభవం ఉంది.

Advertisement

Next Story

Most Viewed