ఒకే రోజున 60 మంది మృతి

by vinod kumar |
ఒకే రోజున 60 మంది మృతి
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 1463 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 28,380కు చేరుకున్నది. ఒకే రోజున 60 మంది కరోనా కారణంగా మృతి చెందితే ఇందులో 42 మంది ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నారు. ముంబై నగరంలో 15 మంది చనిపోయారు. దేశం మొత్తం మీద ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన పేషెంట్లు 6362 మంది. తెలంగాణలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు కావడంతో మొత్తం సంఖ్య 1003కు చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒకే రోజున 80 మంది కొత్తగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం సంఖ్య 1177కు చేరుకున్నది. తమిళనాడులో మాత్రం కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోన్నది. డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతోన్నది. మొత్తం నమోదైన 1937 పాజిటివ్ పేషెంట్లలో 24 మంది చనిపోతే 1101 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆ రాష్ట్రంలో యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లు 812 మంది మాత్రమే.

భారత్ ..
మొత్తం కేసులు : 28,380
మృతులు : 886
రికవరీ : 6362

తెలంగాణ..
మొత్తం కేసులు : 1003
మృతులు : 25
రికవరీ : 332

ఆంధ్రప్రదేశ్..
మొత్తం కేసులు : 1177
మృతులు : 31
రికవరీ : 235

tags: 60 people killed, single day, coronavirus, india, telangana, AP, Tamil Nadu

Advertisement

Next Story

Most Viewed