ఎంపీలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

by Shamantha N |   ( Updated:2020-04-23 07:59:32.0  )
ఎంపీలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
X

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఆరేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అఘాయిత్యానికి ఒడిగట్టడు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఇప్పుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నది. దామో జిల్లాకు చెందిన ఈ పాప నిన్న సాయంత్రం ఇంటి బయట మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా.. ఓ దుండగుడు ఆమెను అపహరించాడు. అనంతరం ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నిన్నటి నుంచి అదృశ్యమైన చిన్నారి ఈ రోజు ఉదయం ఆమె ఆచూకీ లభించింది. కాగా, ఆమె దేహంతో పాటు కళ్లూ తీవ్రంగా గాయపడి ఉన్నాయని పోలీసు అధికారి హేమంత్ సింగ్ చౌహాన్ తెలిపారు.

Tags: rape, girl, madhya pradesh, attacked, kidnapped

Advertisement

Next Story