‘వారు బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే 6 నెలలు జైలు శిక్ష’

by Shyam |
‘వారు బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే 6 నెలలు జైలు శిక్ష’
X

దిశ, హాలియా: కరోనా పాజిటివ్ వచ్చి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై పై 269, 188 ఐపీసీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని తిరుమలగిరి (సాగర్) పోలీసులు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. గ్రామాలలో కరోనా మహమ్మారి రెండో దశలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కొంతమంది యువకులు పెద్దవారు కొవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చినప్పటికీ, తీవ్ర లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బయట తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అలా ఎవరైనా వ్యవహరించి నట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని తెలిపారు.

పాజిటివ్ వచ్చినవారు తప్పనిసరిగా హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూ మెడికల్ కిట్‌లో ఉండే మెడిసిన్ క్రమం తప్పకుండా తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించుకొని వ్యాప్తి ప్రభావం తగ్గేంతవరకు కఠిన నియమాలను పాటిస్తూ మీ కుటుంబ సభ్యులను రక్షించుకునే బాధ్యత మీరే తీసుకోవాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా మాస్కు తప్పనిసరిగా ధరించాలి అన్నారు. పాజిటివ్ వచ్చి మరణించిన వారిలో ఎక్కువ శాతం అధైర్య పడుతూ భయంతో చనిపోయినవారేనని, కావున మీకు, మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినట్లయితే వారిని కౌన్సిలింగ్ చేస్తూ ధైర్యాన్ని నింపి అండగా నిలబడాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed