చనిపోయిన వారినీ వదల్లేదు..

by Shamantha N |
చనిపోయిన వారినీ వదల్లేదు..
X

అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు కొందరు బతికున్న వారినే కాకుండా చనిపోయిన వారిని కూడా వాడుకుంటున్నారు. సరిగ్గా ఈ కోవకు చెందిన ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన వారి డాక్యుమెంట్లను షూరిటిగా పెట్టి రుణాలు పొందుతూ బ్యాంకులను మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్​పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు బ్యాంకులను మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు.ఓ బ్యాంకులో చనిపోయిన వ్యక్తి డాక్యుమెంట్లతో నిందితులు రుణాలు తీసుకుని ఎగవేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. రూ.లక్షల్లో రుణాలు తీసుకుని బ్యాంకులకు టోకరా వేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story