- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రికెటర్లకు యూఏఈలో 6రోజుల క్వారంటైన్
దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19నుంచి నవంబర్ 10వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహించనున్న విషయం తెలిసిందే. కొవిడ్ నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్య భద్రత, ప్రయాణాలు, వసతి, ఇతర సదుపాయాల కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారు. కాగా, యూఏఈ వెళ్లడానికంటే ముందు ఆటగాళ్లకు రెండుసార్లు కొవిడ్ పరీక్షలు చేయనున్నారు. నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లను యూఏఈ తరలించి అక్కడ 6రోజుల క్వారంటైన్‌లో ఉంచుతారు. ఫ్రాంచైజీలు మొదట 3రోజుల క్వారంటైన్‌కు ప్రతిపాదించగా, బీసీసీఐ వారి అభ్యర్థనను తిరస్కరించింది. దుబాయ్ ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఆ దేశానికి బయలుదేరే ముందు 96 గంటల్లో పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలిన వారు 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు, అతిథులు ఉండే హోటళ్లలో బస అంత మంచిది కాదని ఆటగాళ్లు భావిస్తున్నారు. దాంతో ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాయి. రిసార్ట్, అపార్ట్‌మెంట్‌లను అద్దెకు తీసుకోవడానికి యత్నిస్తున్నాయి.