మహబూబ్ నగర్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్

by vinod kumar |
మహబూబ్ నగర్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్
X

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా 6 కేసులు పాజిటివ్ గా తేలాయి. జిల్లావ్యాప్తంగా ఆరుగురికి కరోనా సోకడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 33 యాక్టివ్ కేసులు ఉండగా, తాజాగా నమోదైన కేసులతో కలిపి ఆ సంఖ్య 39కి చేరింది. కొత్త కేసుల్లో మిడ్జిల్ మండల కేంద్రంలో నివాసముంటున్న ఒక్కరికి, దేవరకద్ర మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన చిన్నారి కూడా ఉంది. కాగా, మిగతా నలుగురు మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన వారున్నారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటక్ట్స్‌ను చేధించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అదేవిధంగా కరోనా సోకిన వారి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed