ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఐదుగురు మృతి

by Anukaran |
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికి తోడు అక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పితోర్‌గఢ్‌ జిల్లాలోని తంగా గ్రామంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది గల్లంతైనట్టు అక్కడి అధికారులు గుర్తించారు.

అయితే, వారి ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆరుగురు మృతదేహాలను ప్రమాద స్థలం నుంచి వెలికితీశారు.గల్లంతైన వారి ఆచూకీ కోసం మూడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు.

పితోర్‌గఢ్‌, అస్కోట్‌, అల్మోరా ప్రాంతాల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సైతం గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. డాగ్‌ స్క్వాడ్‌ను సైతం రంగంలోకి దించి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed