- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోయంబేడు ఎఫెక్ట్.. ఏపీలో కొత్తగా 57 కేసులు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్ తగిలింది. గత నాలుగు రోజులుగా కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోందని భావించేలోపు కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు అర్ధసెంచరీ దాటాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2157కి చేరుకుంది. గత రెండు నెలలుగా తీవ్ర ఆందోళనకు గురి చేసిన కరోనా పాజిటివ్ కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అనుకునేలోపు ఒక్కసారిగా కరోనా కేసులు హాఫ్ సెంచరీ దాటాయి.
తాజాగా నమోదైన 57 కేసుల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో 14 చొప్పున కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 8, అనంతపురంలో 4, విజయనగరంలో 3, విశాఖపట్టణం, కడప జిల్లాల్లో రెండేసి కేసుల చొప్పున నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి నమోదైంది. ఇందులో చిత్తూరులోని 13, నెల్లూరులో 8, కర్నూలులో 5, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు కోయంబేడు మార్కెట్‌కి చెందినవి కావడం విశేషం. ఇందులో 25 మంది లారీ, ఆటోడ్రైవర్లను క్వారంటైన్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా రాజధాని కర్నూలు జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టింది. ఈ జిల్లాలో మొత్తం 599 కేసుల్లో 238 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటే, 343 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే గుంటూరులో కూడా 404 కేసుల్లో 139 మంది చికిత్స పొందుతుంటే 257 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 2157 కేసులు నమోదుకాగా, అందులో 857 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1252 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటి వరకు 48 మంది మృతి చెందారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.