- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టేట్ హోంలో 57 మంది బాలికలకు కరోనా, ఐదుగురికి గర్భం
యూపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఓ స్టేట్ హోంలో అశ్రమం పొందుతున్న 57 మంది బాలికలు కరోనా బారిన పడ్డారు. అందులో ఐదుగురు గర్భం దాల్చినట్లు తేలడంతో రాజకీయంగా పెను దూమారం చెలరేగింది. ఈ ఘటనపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి కాన్పూర్ ఎస్సెస్పీ దినేశ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బాలికలు గర్భం రావడం, వీరిలో ఒకరికి హెచ్ఐవీ పాజిటివ్, మరొకరికి హెపటైటిస్-సి ఉన్నట్లు వస్తున్న వార్తలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పూనం కపూర్ స్పందించారు. స్టేట్ హోంలోకి వచ్చిన తరువాత బాలికలు గర్భం దాల్చలేదని ఆమె స్పష్టం చేశారు. వారందరూ అప్పటికే లైంగిక దాడి బాధితులని ఆమె చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కాన్పూర్ కలెక్టర్ బ్రహ్మదేవ్ కూడా ధృవీకరించారు. కరోనా సోకిన బాలికలను ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ తెలిపారు.