- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. పెరిగిన ఉద్యోగాల సంఖ్య
దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల లెక్క తేలింది. తొలి విడతలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. మొత్తం 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి సీఎస్ నివేదిక ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు 44,022 ఉండగా… ఇనిస్టిట్యూషన్స్‌లో 12,957 ఉన్నాయి. మొత్తం 56,979 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు సీఎం కేసీఆర్‌కు సీఎస్ నివేదిక అందించారు. పోలీస్ శాఖలోనే ఎక్కువ ఖాళీలున్నట్లు నివేదికలో వెల్లడించారు.
పోలీస్ శాఖలో 21,507 పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నట్లు నివేదించారు. ఆ తర్వాత వైద్యారోగ్య శాఖలో 10,048 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 3,825 పోస్టులు, బీసీ వెల్ఫేర్‌లో 3,538 పోస్టులు, ఎస్సీ వెల్ఫేర్‌లో 1967, రెవెన్యూ విభాగంలో 1700 పోస్టులు భర్తీ చేయాలని నివేదికల్లో వెల్లడించారు. అత్యధికంగా ఐటీ విభాగంలో నాలుగు పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నట్లు తేల్చారు. రాష్ట్ర కేబినెట్ భేటీ బుధవారం మధ్యాహ్నం మొదలైంది. ఈ కేబినెట్లో ఈ పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.