హుజురాబాద్‌లో దళితులకు గుడ్ న్యూస్.. జీవో విడుదల చేసిన సర్కార్

by Anukaran |   ( Updated:2023-10-10 16:01:08.0  )
KCr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన తెలంగాణ దళిత బంధు పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. జీఓ ఆర్‌టీ నెంబర్ 114 ద్వారా రూ. 500 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. వీరికి సీఎం చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేసే అవకాశాలు ఉన్నాయి. దళిత బందు పథకం ప్రకటించిన ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దళిత బందు పథకం లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో జిల్లా అధికారులు నిమగ్నం అయ్యారు. మొదటి విడుతగా మంజూరైన రూ. 500 కోట్లు అర్హులైన వారికి అందజేసేందుకు జాబితా సిద్దం చేయనున్నారు.

కేసీఆర్‌, హరీష్‌కు ఈటల సవాల్

Advertisement

Next Story

Most Viewed