- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సభ్యత్వాలే టార్గెట్.. ప్రతి నియోజకవర్గంలో 50వేలు చేయాల్సిందే
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి నియోజకవర్గానికి పార్టీ నిర్దేశించిన 50వేల సభ్యత్వ నమోదు టార్గెట్ ను పూర్తిచేయాల్సిందేనని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధానకార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటైజేషన్ ప్రక్రియ, జీవిత బీమా, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి, పార్టీ ఇతర వ్యవహారాలపై చర్చించారు. ప్రధానంగా సభ్యత్వ నమోదుపై చర్చ జరిగింది. కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈనెల 20 వరకు సభ్యత్వాలను డిజిటలైజేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 119 నియోజకవర్గాలకు కేవలం 20 నియోజకవర్గాల్లోనే 50వేలకు పైగా సభ్యత్వ నమోదు జరిగిందని, మిగతా వాటిలో ఎందుకు జరుగలేదో అధ్యాయనం చేయాలన్నారు. హైదరాబాద్ లో తక్కువ జరిగిన పాతబస్తీ నేతలతో మాట్లాడి టార్గెట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు నేతల పనితీరుకు నిదర్శనమన్నారు. ఆగస్టులోగా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని సూచించారు.
పురోగతిలో ఉన్న పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవనాలను ప్రారంభించిన వెంటనే పార్టీ శ్రేణులకుశిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. సభ్యత్వాల డిజిటలైజేషన్ పై ఈనెల 21న మరోసారి సమావేశం నిర్వహించన్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఇతర పార్టీలు టార్గెట్ కాదు
టీఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీలు టార్గెట్ కాదని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, షర్మిల లాంటి వారు పార్టీ పదవులను చేపట్టారని… వారు ఉరుకులాడినంత మాత్రాన టీఆర్ఎస్‌కు ఎలాంటి నష్టం ఉండదన్నారు. మనపని మనం చేసుకుంటూ పోదామని… ఎప్పుడు అలర్టుగా ఉండి నాయకులను, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
హుజూరాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఈటల చేసినట్లుగా చెప్పుకుంటున్నాడని… టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిగా ప్రజలకు వివరించి క్రెడిట్ మనకే దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బండి రమేష్, బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రవణ్ కుమార్ రెడ్డి, రాములు, బాలమల్లు, సారయ్య తదితరులు పాల్గొన్నారు.