మీ సేవలకు ఇక సెలవు.. రోడ్డున పడ్డ 50 కుటుంబాలు

by Anukaran |
staff-nurse
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రిలో 50 మంది స్టాఫ్ నర్సులకు అధికారులు ఉద్వాసన పలికారు. వీరంతా కరోనా కష్టకాలం మొదలయ్యాక ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులై ఇన్ని రోజులు సేవలందిస్తూ వచ్చారు.

ఇటీవల టీఎస్‌పీఎస్పీ ద్వారా నియామకమై శాశ్వత స్టాఫ్ నర్సులు రానున్న నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ పద్దతిన పని చేస్తున్న వారిని తొలగిస్తూ వైద్య సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఉన్నపళంగా తమను తొలగించడం పట్ల నర్సులు గురువారం సూపరింటెండెంట్ వద్ద మొర పెట్టుకున్నారు. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ.. డీఎంఈ ఆదేశాల మేరకు కొత్త స్టాఫ్ నర్సులు రానున్నారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ నియామకాలు తొలగింపు అంతా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుగుతుందని, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని సెలవిచ్చారు.

Advertisement

Next Story