- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం అటెండెన్స్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాలను కరోనా చుట్టుముట్టడంతో అనధికారికంగా 50 శాతం అటెండెన్స్ అమలవుతోంది. ఇప్పటికే సచివాలయంలో ఉద్యోగులు రోటేషన్ పద్ధతిలో విధులకు హాజరవుతున్నారు. పలు కీలకమైన శాఖల్లో ఉన్నతాధికారులతో పాటుగా అధికారులు, సిబ్బందికి పాకింది. సీఎస్‌తో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ డీఎంఈ రమేష్‌రెడ్డి, ఎస్ఈసీ పార్థసారధి వంటి ఉన్నతాధికారులంతా కరోనా బారిన పడ్డారు. దీంతో కార్యాలయాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో అనధికారికంగా 50 శాతం ప్రకారం ఉద్యోగులు హాజరవుతున్నారు.
చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్‌ను గతంలోనే ప్రవేశపెట్టడంతో పలు విభాగాల్లో వర్క్ ఫ్రం హోం కంటిన్యూ చేస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నేతల వినతి మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఇంటి నుండే పని చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని శాఖలు, హోచ్ఓడీ విభాగాల్లో ఉద్యోగుల రోటేషన్ పద్ధతిని అమలు చేస్తున్నారు. సచివాలయంతో పాటుగా వివిధ శాఖల ప్రధాన కార్యలయాలు, జిల్లా కార్యాలయాల్లోనూ ఉద్యోగులను రెండు గ్రూపులుగా విభజించి షిఫ్టు, రొటేషన్ పద్దతిన విధులకు హాజరవుతున్నారు. అయితే ఇదంతా అనధికారికంగానే చేస్తున్నారు. 50 ఏళ్ళు వయస్సు పైబడి శ్వాసకొస సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అధికారులు, ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
భయం పెరుగుతోంది
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల్లో భయం నెలకొంది. ఉద్యోగుల్లో దాదాపుగా 40 ఏండ్ల పైబడినవారే ఎక్కువగా ఉన్నారు. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్నా.. పాజిటివ్ వస్తుండటంతో భయాందోళనలో కార్యాలయాలకు వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలకు రావాలంటేనే జంకుతున్నారు. చాలా మంది ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వర్తిస్తామని ఉన్నతాధికారులకు సూచించారు. పరిస్థితలకనుగుణంగా వారికి కొంత ఉపశమనం కల్పిస్తున్నారు.
గెజిటెడ్ అధికారులు మాత్రం హాజరు కావాల్సిందే
పలు శాఖల్లో ఉద్యోగులకు 50 శాతం హాజరు, వర్క్ ఫ్రం హోం అమలు చేస్తే.. గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు అనధికారిక ఆదేశాలిచ్చారు. అయితే సచివాలయంలో సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సహా దిగువ స్థాయి కేడర్‌లోని ఉద్యోగులంతా రెండు గ్రూప్‌లుగా ఏర్పడి ప్రత్యామ్నాయ వారాల్లో విధులకు హాజరవుతుండగా… అత్యవసర సేవల విభాగాల్లో మాత్రం యధావిధిగా విధుల్లో ఉండే విధంగా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని అమల్లో పెట్టినట్లు ఉద్యోగవర్గాలు చెప్పుతున్నాయి.