- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను నమ్మినందుకు థాంక్స్ : తేజ్
దిశ, వెబ్‌డెస్క్ : నా మనసుకు నచ్చిన.. నా మనుషులపై నమ్మకం పెంచిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంటూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు డైరెక్టర్ హరీష్ శంకర్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తి కాగా.. నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, అద్భుతమైన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీజే మేయర్‌కు థాంక్స్ చెప్పారు. ప్రతీ ఒక్క టెక్నీషియన్‌కు ధన్యవాదాలు తెలిపిన హరీష్ శంకర్.. సుప్రీం హీరో, స్టార్ బ్రదర్ సాయి ధరమ్ తేజ్‌తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాడు. తన ప్రేమ, పాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పిన హరీష్.. గువ్వా గోరింక సాంగ్ టైమ్‌లో తేజ్ హార్డ్ వర్క్, డెడికేషన్‌కు ఫిదా అయ్యానని చెప్పాడు.
https://twitter.com/IamSaiDharamTej/status/1309081226284761089?s=19
ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన తేజ్.. ఫస్ట్ సినిమా రిలీజ్‌కు ముందే తనపై నమ్మకముంచి సుబ్రమణ్యం క్యారెక్టర్‌ను ఇచ్చినందుకు హరీష్ శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడూ సుబ్రమణ్యం ఫర్ సేల్‌కు ముందు, దాని తర్వాత అని నన్ను నేను చూసుకుంటానని చెప్పిన తేజు.. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా తేజ్ ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న ఈ చిత్రం సూపర్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వగా.. తేజ్, రెజీనా, బ్రహ్మానందం కాంబినేషన్‌లో కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి.