మావోయిస్టుల సంచారం.. పోలీసుల తనిఖీలు!

by Sumithra |   ( Updated:2020-08-29 08:57:28.0  )
maoists
X

దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ రూరల్ జిల్లాలో మావోయిస్టులు దలదాచుకున్నారని సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని నల్లబెల్లి మండలం మేడపల్లి, కొండాపురం, మురళీనగర్ గ్రామాలను చుట్టుముట్టారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఇదిలాఉండగా, ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు బాగా పెరిగాయి. దీంతో పోలీసులు ఉమ్మడి వరంగల్‌పై దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో భాగంగా మహముత్తారం మండలం సింగారంలో మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురి నుంచి భారీగా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story