కామారెడ్డిలో 5కరోనా పాజిటివ్ కేసులు

by vinod kumar |
కామారెడ్డిలో 5కరోనా పాజిటివ్ కేసులు
X

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ అయినట్టు గాంధీ వైద్యాధికారులు సోమవారం ధ్రువీకరించారు.ఇటీవల ముంబైలో కరోనాతో చనిపోయిన వ్యక్తికి సంబంధించి 8మంది(ముంబైలోని వర్లికి చెందిన వాసులు)కుటుంబ సభ్యులు కామారెడ్డిలోని తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు. అయితే, వారి రక్త నమూనాలను సేకరించి ఆదివారం వైద ఆరోగ్య శాఖ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు.ఈ రోజు వచ్చిన రిపోర్టుల్లో 5గురికి పాజిటివ్ సోకినట్టు కోవిడ్-19 నోడల్ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీకి తరలించారు. వీరందరూ కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీలోని హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారు కావడం గమనార్హం.

Advertisement

Next Story