పంద్రాగస్టు నాటికి 4,696 స్మార్ట్​ వాష్​ రూమ్స్​

by Shyam |   ( Updated:2020-06-09 09:00:06.0  )
పంద్రాగస్టు నాటికి 4,696 స్మార్ట్​ వాష్​ రూమ్స్​
X

దిశ, న్యూస్‌బ్యూరో: జీహెచ్ఎంసీ మినహా 139 అర్బన్​ లోకల్​ బాడీస్​(మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు) పరిధిలో దాదాపు 77 లక్షల మంది (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉండగా.. 7,685 పబ్లిక్​ టాయిలెట్స్ అవసరముందని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం 2,989 పబ్లిక్​ టాయిలెట్స్​ అందుబాటులో ఉండగా.. అదనంగా 4,696 పబ్లిక్​ టాయ్​ లెట్స్​ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్ల పరిధిలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అందులో భాగంగా వచ్చే పంద్రాగస్టు నాటికి మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో అదనంగా 4,696 పబ్లిక్​ టాయ్​లెట్స్​ నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్​ కమిషనర్లను మంత్రి కేటీఆర్​ మంగళవారం ఆదేశించారు. పురపాలక శాఖ నిర్ణయించిన 23 రకాల ‘స్మార్ట్​ వాష్​ రూమ్స్​’ నిర్మాణాలు చేపట్టాలని ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్థానిక పరిస్థితులు, జనాభా అవసరాలకు లోబడి డిజైన్లను వినియోగించుకోవాలని అర్వింద్​ కుమార్​ ఈ సందర్భంగా సూచించారు.

Advertisement

Next Story