బద్వేలులో 44.82 శాతం పోలింగ్

by srinivas |
Badvelu by-election
X

దిశ, రాయలసీమ: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు వస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నాం మూడు గంటల వరకు 44.82 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండడంతో ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed