- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమానుషం : బాలికపై 400 మంది అత్యాచారం.. చివరికి పోలీసులు కూడా..
దిశ, వెబ్‌డెస్క్ : మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా దాడులు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. పసికందు నుంచి వృద్ధురాలి వరకు ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు దేశంలో ఎంతో మంది మహిళలు, యువతులు లైంగిక దాడికి బలవుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 400 మంది యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తల్లి మరణించి, బాల్య వివాహం చేసుకొని భర్త వేధింపులు తాళలేక భర్తను వదిలేసిన బాలికపై కొందరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా అకాడమీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఇద్దరు వ్యక్తులు ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరవాత మొత్తం 400 మంది మైనర్ పై అత్యాచారం చేశారు. ఈ అమానుష ఘటన బీద్ జిల్లాలోని అంబజోగైలో చోటు చేసుకుంది. దీంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లితే న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా దారుణానికి ఒడిగట్టారు. న్యాయం చేయాల్సింది పోయి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాలికకు న్యాయం చేస్తానంటు నమ్మబలికి లాడ్జ్‌కు తీసుకెళ్లి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసు శిశు సంక్షేమ శాఖ వరకూ చేరిది. దాంతో ఏస్పీ విచారణకు ఆదేశించారు. ఇప్పటికే 9మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. మిగితవారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
- Tags
- maharashtra
- minor