దుబాయ్‌లో 400 మంది రక్తదానం

by Sridhar Babu |
దుబాయ్‌లో 400 మంది రక్తదానం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: స్వాతంత్ర్య దినోత్సవం(independence day) పురస్కరించుకుని దుబాయ్‌లో 400 మంది రక్తదానం(blood donation) చేశారు. దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి కార్యదర్శి చిలుముల రమేష్ అందించిన వివరాల ప్రకారం.. యూఏఈ ఆరోగ్య శాఖ పిలుపు మేరకు, భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దుబాయ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా (dubai friends of india) ఆధ్వర్యంలో లతీఫా ఆసుపత్రిలో ప్రత్యేక రక్త దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 400 మంది భారతీయులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లాల శ్రీనన్న సేవాసమితి అధ్యక్షుడు రవి ఉట్నూరి, సలహాదారుడు లక్ష్మీరాజం, షార్జా & అజ్మన్ సమన్వయకర్త రవి డేవిడ్, కార్యవర్గ సభ్యులు గంగాధర్ అలిగేటి, నరేష్ రాచకొండ పాల్గొన్నారు.

Advertisement

Next Story