నిత్యావసరాల ధరలపై 400 ఫిర్యాదులు…

by Shyam |
prices increased
X

దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలను పెంచడంపై ఫిర్యాదులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జనతా కర్ఫ్యూ విధించిన మార్చి 22 నుంచి రెండు మూడు రోజులపాటు విపరీతంగా ధరలను పెంచగా ప్రభుత్వ సీరియస్ కావడంతో దిగొచ్చాయి. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ధరల పెంపు అలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నిత్యావసరాల ధరల పెంపుపై 20రోజుల వ్యవధిలో 400 వరకు ఫిర్యాదులు వచ్చినట్టు పౌర సరఫరాల శాఖ కంట్రోల్ సిబ్బంది తెలిపింది. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదులు ఏయే జిల్లాలు, సర్కిళ్ల వారీగా ఉన్నాయో పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసరాలను అధిక రేట్లకు విక్రయిస్తే 040 – 2344 7770 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు పేర్కొంటున్నారు. ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే దుకాణాల అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే.

tags: Corona Effect, Civil Supply, Hyderabad, Lockdown, Essential Prices

Advertisement

Next Story