- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిసెంబర్‌లోపు 40 కోట్ల డోసుల కరోనా టీకా!
ముంబయి :
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా ఫార్మా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ఆశాజనక ఫలితాలనివ్వడంతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఆ వ్యాక్సిన్ తయారీకి ప్రణాళికలు రచిస్తోంది. ఆస్ట్రా జెనెకాతో సీరం కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌లో ఈ టీకా ట్రయల్స్ చేపట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, డిసెంబర్ కల్లా 30 నుంచి 40 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాను తయారుచేస్తామని ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఒక్క డోసులో 10 సిరంజీ బుడ్డీలుంటాయని ప్రకటించారు.
ఈ వ్యాక్సిన్ సుమారు రూ. 1,000 ఖరీదు ఉంటుందని తెలిపారు. యూకే, ఇండియాలో ఈ టీకా ప్రయోగాలు విజయవంతమైతే పేషెంట్లకు అందుబాటులోకి వచ్చే తొలి వ్యాక్సిన్ కొవిషీల్డ్‌యే అవుతుందని ఆయన వివరించారు. వ్యాక్సిన్ విజయవంతమైతే దాని ఉత్పత్తి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు ఎస్ఐఐని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకాలు ఎంపిక చేసుకున్నాయి.