ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు వ్యక్తులు దుర్మరణం..

by Mahesh |
road accident
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండల కేంద్ర సమీపంలో కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మగవారు ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story