నెల్లూరులో రెండు లారీల మధ్యలో ఇరుక్కున్న కారు.. నలుగురు మృతి

by srinivas |   ( Updated:2021-07-04 06:31:00.0  )
నెల్లూరులో రెండు లారీల మధ్యలో ఇరుక్కున్న కారు.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకే వస్తున్న కారు డ్రైవర్ కూడా ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా కారును ఢీకొట్టింది. రెండు లారీల మధ్య కారు ఇరుక్కోవడంతో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వీరయ్య, లక్ష్మి, మణికంఠ, స్వాతిగా గుర్తించారు. మృతులంతా రాజమండ్రి వాసులుగా తెలుస్తోంది.

ఆ సమయంలో వీరంతా తిరుపతి నుంచి రాజమండ్రికి తిరుగు ప్రయాణమైనట్లు బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.

Advertisement

Next Story