- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనందం మిగిల్చిన విషాదం.. గోదావరిలో నలుగురి గల్లంతు!
దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ జిల్లాలో తీరని విషాదం నెలకొంది.పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు 16 మంది యువకులు సంతోషంగా గోదావరి నదితీరానికి వెళ్లారు. సరదగా ఈత కొట్టేందుకు కొందరు యువకులు నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు అందులో నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించగా అప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారు ప్రకాశ్ , కార్తీక్‌లుగా గుర్తించారు.
కనిపించకుండా పోయిన మరో ఇద్దరు శ్రీకాంత్, అన్వేష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన వెంకటాపురం మండలం మరికాల గోదావరి వద్ద ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉండగా, ఈ ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. గల్లంతైన వారి ఆచూకీని కనుగొనేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. అంతేకాకండా, గోదావరిలో స్నానానికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.