భారత్‌లో 3875 కొత్త కరోనా కేసులు

by Shamantha N |
భారత్‌లో 3875 కొత్త కరోనా కేసులు
X

న్యూఢిల్లీ :
ఇండియాలో కరోనా వ్యాప్తి రోజు రోజుకూ ఉధృతమవుతోంది. పలు రాష్ట్రాల్లో టెస్టింగ్‌లను పెంచడంతో ఆ మేరకు పాజిటివ్‌ల సంఖ్య బయటపడుతోంది. గడిచిన 24 గంటల్లో 3875 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక బులిటెన్‌లో ప్రకటించింది. అదే సమయంలో 194 మంది కోవిడ్ – 19 కారణంగా మృత్యువాత పడినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 46,711 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1583 మంది మృతి చెందారు. మరోవైపు కోవిడ్-19 కోసం పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు భారీగానే కోలుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజు లోనే రికార్డు స్థాయిలో 1399 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 13,161కి చేరింది. కాగా, గత రెండు రోజుల నుంచి లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం, పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాల ఎదుట భౌతిక దూరం నిబంధనలను బేఖాతరు చేస్తూ బారులు తీరడంతో రాబోయే రోజుల్లో కేసులు పెరుగుతాయేమోనని అధికారులు ఆందోళన చేస్తున్నారు. వలస కార్మికులు కూడా తెలంగాణ, కర్ణాటక, ఏపీ వంటి రాష్ట్రాల్లో ఆందోళనకు దిగుతున్నారు. వీరిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కావట్లేదు. ఇవన్నీ కరోనా వ్యాప్తికి దోహదపడే అంశాలే కావడం అధికారులను కలవరపెడుతోంది.

Tags: Coronavirus, Covid-19, India, Toll, Discharge, Deaths, Recovery, Positive, MoHFW

Advertisement

Next Story

Most Viewed