RTC కీలక నిర్ణయం.. మేడారం భక్తులకు గుడ్ న్యూస్

by Anukaran |   ( Updated:2021-12-23 00:41:59.0  )
RTC కీలక నిర్ణయం.. మేడారం భక్తులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి జాతర సమక్క సారలమ్మ జాతర. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన ఈ జాతర రెండేళ్లకు ఒకసారి వస్తుంది. ములుగు జిల్లాలో జరిగే ఈ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని వారికి ఎంతో ప్రీతికరమైన బంగారాన్ని సమర్పిస్తారు. ప్రస్తుతం దీని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై కొవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర కొరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే 3,845 బస్సులు మోహరించినందున మేడారంలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed