తెలంగాణలో 38 కేసులు.. 5 గురు మృతి

by vinod kumar |
తెలంగాణలో 38 కేసులు.. 5 గురు మృతి
X

దిశ, న్యూస్ బ్యూరో: జీహెచ్ఎంసీ, వలస కార్మికుల్లోనూ కరోనా ఉధృతి ఆగడం లేదు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత బయటపడుతున్న కేసులన్నీ ఆయా పరిధిలోనే ఉంటున్నాయి. అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు కర్ఫ్యూ‌ను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న కరోనా కేసులకు బ్రేక్ పడటం లేదు. రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు గురువారం నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 26, రంగారెడ్డిలో రెండు, 10 మంది వలస కార్మికులు ఉన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,699 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో ఐదుగురు మృతిచెందారు. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు 45 సంభవించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. చికిత్స తీసుకున్నవారిలో గురువారం 23 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,036కు చేరుకుంది. మరో 618 మంది కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. ఇక వలస కూలీల్లో పది మందికి కొత్తగా కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పటి వరకు వైరస్ సోకిన వలస కార్మికుల సంఖ్య 99కు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed