త్రీమినిట్స్ వీడియో కాల్‌… 3,700 మంది జాబ్స్ గాన్

by vinod kumar |
త్రీమినిట్స్ వీడియో కాల్‌… 3,700 మంది జాబ్స్ గాన్
X

కరోనా మహమ్మారి కారణంగా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రావడంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మీ ఉద్యోగం పోయిందని తమ సిబ్బందికి చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ఉబర్ సంస్థ చేసిన పనికి ఇప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రపంచమంతా కరోనా ఉందని తెలుసు, తమ ఉద్యోగులు దాని వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలుసు అయినప్పటికీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్క వీడియోకాల్ చేసి ఇవాళే మీకు చివరి వర్కింగ్ డే అని చెప్పడంతో ఉబర్ ఉద్యోగులు అవాక్కయ్యారు.

జూమ్ ద్వారా కాల్ చేస్తే, తమ సంస్థ సిబ్బంది మొత్తానికి మీటింగ్ పెడుతుందేమోనని అనుకున్నారు. కానీ అదే జూమ్ కాల్‌లో ఇన్ని రోజులు మీ సేవలు అందించినందుకు ధన్యవాదాలు, ఇక మీరు పనిచేయనవసరం లేదని చెప్తున్నారని వాళ్లు ఊహించలేదు. అయితే జూమ్ కాల్ ద్వారా 3700 మందిని ఒకేసారి తొలగించడంపై సర్వత్రా విమర్శలు తలెత్తున్నాయి. ఇలాంటి వార్తను చెబుతున్నపుడు తనకు కూడా చాలా బాధగా అనిపించిందని, కానీ తప్పలేదని ఉబర్ కస్టమర్ సర్వీస్ రఫిన్ చెవెలే అన్నారు. వీడియోకాల్ తమ కంపెనీ పరిస్థితులను మూడు నిమిషాల్లో వివరించి ఉద్యోగులకు థ్యాంక్యూ కూడా చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా తమ రైడ్లు సగానికి పైగా తగ్గిపోయాయని, అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌ల అవసరం కూడా లేకపోవడంతో వారిని తొలగించినట్లు ఆమె తెలిపారు. ఉద్యోగం నుంచి తీసేస్తున్న విషయం ముందే చెప్పని కారణంగా కొంత బోనస్ జీతం కూడా ఇచ్చినట్లు రఫిన్ వెల్లడించారు. 2020 ప్రథమ త్రైమాసికంలో ఆ సంస్థ తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 2.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో తమ బైక్, స్కూటర్ సర్వీసును, తాము పెట్టుబడులు పెడుతున్న లైమ్ సంస్థను ఉబర్ వదిలించుకుంది.

Advertisement

Next Story