ఏపీలో కరోనా @ 3,588

by srinivas |
coronavirus
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కంట్రోల్ తప్పుతోంది. పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ పల్లె, పట్టణ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన మరో 49 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 3,588 మందికి కరోనా సోకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

విదేశాల నుంచి వచ్చిన వారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి ఏపీలో 4,460 కేసులు నమోదయ్యాయి. వీరిలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందడం ద్వారా ఇప్పటివరకు 2,323 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మరో 1,192 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది. కరోనా కారణంగా నిన్న ఎవరూ మృతి చెందకపోవడంతో కరోనా మృతుల సంఖ్య (73)లో ఎలాంటి మార్పులేదని తెలిపింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న 29 మందిని డిశ్చార్జి చేశారు.

Advertisement

Next Story